శంకర్ సినిమాలు చాలా స్లోగా తీస్తాడనే రిమార్క్ ఉంది. రీషూట్స్ ఎక్కువగా ఉంటాయనే టాక్ కూడా ఉంది. అతడు రీషూట్స్ చేస్తున్నాడో లేదా తెలియదు కానీ, ఈసారి మాత్రం స్పీడ్ పెంచాడు. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాను షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అమృత్ సర్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేశారు. ఇప్పుడు మరోసారి అక్కడికే వెళ్తున్నారు. రేపట్నుంచే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి లొకేషన్ కు నిర్మాత దిల్ రాజు వెళ్లడం లేదు. ఆయనకు కొడుకు పుట్టాడు. ప్రస్తుతం ఆయన సంబరాల్లో మునిగి తేలుతున్నారు. షూట్ వ్యవహారాల్ని శిరీష్ చూసుకుంటారు.
రామ్ చరణ్, కియరా అద్వానీ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాకు అధికారి అనే టైటిల్ అనుకుంటున్నారు. దాదాపు అదే పేరును ఫిక్స్ చేసే అవకాశం ఉంది. జీ స్టుడియోస్ బ్యానర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
సినిమాకు సంబంధించి ఇప్పటికే 50శాతం టాకీ పూర్తయిందనేది ఇంటర్నల్ టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పాటల షూటింగ్ ప్రారంభమౌతుంది. దీని కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు. శంకర్ సినిమాల్లో సాంగ్స్ కూడా చాలా స్పెషల్ గా, భారీగా ఉంటాయి.