రామ్ చరణ్, శంకర్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చాలా విరామం తర్వాత శంకర్ ఈ వారంలో సినిమా షూటింగ్ ను పునఃప్రారంభించనున్నాడు. వివిధ నగరాల్లో రామ్ చరణ్, డ్యాన్సర్లపై ఓ పాటను చిత్రీకరించనున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో కొంత భాగాన్ని చిత్రీకరించనున్నారు. ఆ షూటింగ్ రేపట్నుంచి మొదలవుతుంది. మిగిలిన పనులు రాజమండ్రి, వైజాగ్‌లలో జరుగుతాయి. జూన్ నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా కనిపించనున్నారు. సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు.
సాధారణంగా ఓ సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా తీస్తాడు శంకర్. కానీ భారతీయుడు-2 అతడి మెడకు చుట్టుకుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య భారతీయుడు-2తో పాటు రామ్ చరణ్ సినిమా షూటింగ్స్ ను కూడా కొనసాగిస్తున్నాడు.