ఇంగ్లండ్‌కు చెందిన స్టార్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ ఐపీఎల్ లో రాజస్థాన్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో బట్లర్ చెలరేగాడు. ఓ మ్యాచ్‌లో బట్లర్ 44 పరుగులు సాధించగా, మరొక మ్యాచ్ లో 54 పరుగుల్లోనే 77 పరుగులు చేశాడు. ఇక రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపులో బట్లర్ కీలకపాత్ర పోషించాడు. అయితే బట్లర్ ఉన్న ఫాం ప్రస్తుతం రాజస్థాన్‌కు ఐపీఎల్‌లో ప్లస్‌గా మారనుంది. కాగా ఓ ఆర్‌సీబీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఫ్యాన్ జాస్ బట్లర్‌ను తమకు ఇచ్చేయాలని, అందుకు ఏం చేయాలని రాజస్థాన్‌ను కోరాడు.
రాజస్థాన్ జట్టుకు ఆడనున్న జాస్ బట్లర్‌ను తమ ఆర్‌సీబీ జట్టుకు ఇవ్వాలని, అందుకు ఏం చేయమన్నా చేస్తానని.. ఓ ఫ్యాన్ రాజస్థాన్ రాయల్స్ ను ట్విట్టర్‌లో కోరాడు. అయితే అందుకు రాయల్స్ జట్టు గట్టిగా రిప్లై ఇచ్చింది. మీకు కావాలంటే పోటీ నుంచి తప్పుకోవచ్చు.. అంటూ కేబీసీ షోలో నటుడు అమితాబ్ బచ్చన్ వాడే డైలాగ్‌తో రాయల్స్ జట్టు ఆ వ్యక్తికి రిప్లై ఇచ్చింది. దీంతో ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Aap chahe toh quit kar sakte hain 😅🙏 https://t.co/chphKJulZC pic.twitter.com/kuSnKz8R1g
— Rajasthan Royals (@rajasthanroyals) September 6, 2020
కాగా రాజస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 22న చెన్నైతో ఆడనుంది. తరువాత అక్టోబర్ 3న ఆ జట్టు బెంగళూరుతో తలపడుతుంది. ఇక రాజస్థాన్ జట్టులో బట్లర్‌తోపాటు స్టీవెన్ స్మిత్, డేవిడ్ మిల్లర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై, జోఫ్రా ఆర్చర్ వంటి కీలక విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో ఆ జట్టు ఇతర టీంలకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.