దిశా హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తయింది. సుమారు 5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. రీ పోస్టుమార్టం ప్రక్రియను మొత్తం వీడియో తీశారు. నలుగురు నిందితుల రీ పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం నిపుణు సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించనున్నారు.
పోస్టుమార్టం ముగిసిన తరువాత ధృవీకరణ పత్రంపై కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకొని నలుగురి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు నలుగురు నిందితుల మృతదేహాలు 50శాతం కుళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఏ1 మహమ్మద్ ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు, ఏ2 చెన్నకేశవులు శరీరంలో మూడు, నవీన్ శరీరంలో రెండు బుల్లెట్లు, శివ బాడీలో ఒక బుల్లెట్ గాయం ఉన్నట్టు సమాచారం. భారీ భద్రత నడుమ నిందితుల మృతదేహాలకు వారి స్వగ్రామాలకు తరలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి.