వినాయక నిమజ్జనం పై హైకోర్టులో విచారణ జరిగింది. మరోవైపు మూడో రోజు నుంచి గణపతుల నిమర్జన కార్యక్రమం జరగాల్సి ఉన్న నేపధ్యంలో ఈరోజున నిమర్జనం కావాల్సిన విగ్రహాలు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. కాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు హైకోర్టు అనుమతులు నిరాకరించింది హైకోర్టు.
హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే హౌస్ మోషన్ పిటిషన్‌ను ఈరోజు విచారించేందుకు హైకోర్ట్ నిరాకరించింది. పిటిషన్‌ను రేపు విచారిస్తామని హైకోర్టు పేర్కొన్నది.