రాజ్యసభ సభ్యుడు వైవీఎస్ చౌదరి:
పోలవరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రాజెక్టు భవితవ్యంపై ఏపి ప్రజల్లో గందరదోళం నెలకొంది. రివర్స్ టెండరింగ్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరాను.
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ :
‘పోలవరం’పై మొదట్నుంచి మా స్టాండ్ ఒక్కటే.. కోర్టు స్టే ఇచ్చింది డ్యామ్, హెడ్‌వర్క్స్ గురించి కాదు.. పవర్ ప్రాజెక్టుపైనే స్టే ఇచ్చింది. పోలవరం ఆగిపోయినట్టు, ఆపేస్తున్నట్టు హడావిడి చేస్తున్నారు. పనుల విషయంలో యధావిధిగా ‘రివర్స్ టెండరింగ్’కి వెళ్లొచ్చు. ‘రివర్స్ టెండరింగ్’కి వెళ్తే అవినీతి బయట పడుతుందని చంద్రబాబుకి భయం పట్టుకుంది.. ఏమైనా కోర్టు తీర్పు గౌరవిస్తాం.. ఎలా ముందుకు వెళ్ళాలో నిర్ణయం తీసుకుంటాం…