విజయవాడ: దుర్గమ్మ నదీ విహారానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర హంస వాహనాన్ని సిద్ధం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు దుర్గామల్లేశ్వరులు కృష్ణా నదిలో నదీ విహారం చేయనున్నారు. నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు దసరా పండుగ నాడు సాయంత్రం కృష్ణానదిలో అంగరంగవైభవంగా తెప్పోత్సవం జరపడం ఆనవాయితీ. ఇప్పటికే హంస ఆకారంతో వాహన వాహనం సిద్ధం చేశారు. ప్రకాశం బ్యారేజి దగ్గర కృష్ణానదిలో తెప్పోత్సవం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. తెప్పోత్స వాన్ని భక్తులు కనులారా చూసేందుకు దుర్గాఘాట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెప్పోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.