ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ లు తెరుస్తారని.. ఎజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేయనున్నట్టు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల్లో ఆదిలాబాద్ లో 6 టేబుల్స్.. కరీంనగర్ లో 9 టేబుల్స్… మిగితా చోట్ల 5 టేబుల్స్ ను ఏర్పాటు చేసినట్టు గోయల్ తెలిపారు. నల్గొండ, మెదక్ లలో ఎక్కువ రౌండ్స్ ఉంటాయన్నారు. 25 ఓట్ల చొప్పున బండిల్స్ ఏర్పాటు చేసి చివరిగా కౌంట్ చేస్తారని వివరించారు.
ప్రతీ ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే కౌంటింగ్ సెంటర్ లోపలికి అనుమతి ఉంటుందని చెప్పారు శశాంక్ గోయల్. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండొద్దని… ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌంటింగ్ అనంతరం ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు గోయల్.