ఫుల్ ఆకలిగా ఉండి… ఇంట్లో తినటానికి ఏం లేకపోతే క్షణాల్లో రెడీ చేసుకోగలిగే ఇన్‌స్టాంట్ ఫుడ్ మ్యాగీ. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ మ్యాగీతో ఆకలి నింపుకుంటుంటారు. కానీ ఇప్పుడు మ్యాగీతో ఆకలే కాదు… హాయిగా తిరగటానికి చెప్పులు కూడా వచ్చేస్తున్నాయి. వినటానికి కాస్త వింతగా అనిపిస్తున్నా… మార్కెట్‌లోకి ఇటాలియన్ మ్యాగీ చెప్పులు వచ్చేశాయి.
అయితే… నిజమైన మ్యాగీతో చెప్పులా అని కంగారు పడకండి. ఈ ఇటాలియన్ బ్రాండ్ చెప్పులు చూడటానికి మ్యాగీ నూడిల్స్ తరహాలోనే ఉంటాయి కానీ అసలైన మనం రోజూ తినే మ్యాగీ కాదు. అచ్చం అలా చూడటానికి కనపిస్తాయంతే.