టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌ను కలిసింది. ముంబైలోని ఆయన ఇంటికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడింది. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ విశేషాలను గురించి సచిన్ ఆమెను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిచారు. అనంతరం సచిన్‌ను కలిసిన ఫోటోలను ట్విట్టర్‌లోమీరాబాయి చాను షేర్ చేసుకుంది.
సచిన్ సార్‌ని ఉదయం కలిశాను. నన్ను ప్రోత్సహిస్తూ ఆయన మాట్లాడిన మాటలను ఎప్పటికి మరిచిపోలేను. నిజంగా ఎంతో స్ఫూర్తి పొందాను అంటూ ట్వీట్ చేసింది.
Loved meeting @sachin_rt Sir this morning! His words of wisdom & motivation shall always stay with me. Really inspired. pic.twitter.com/Ilidma4geY
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 11, 2021
సచిన్ కూడా రిప్లై ఇచ్చారు. తనకు కూడా చాలా సంతోషంగా ఉందని అన్నారు. మణిపూర్ నుంచి టోక్యో వరకూ వెళ్లిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు. ఇంకా ఎన్నో ప్రదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందావు.. మరింత కష్టించు అని చెప్పుకొచ్చారు.
Equally happy to meet you this morning, @mirabai_chanu! 🙂
It was wonderful talking to you about your inspiring journey from Manipur to Tokyo.
You've got places to go in the coming years, keep working hard. https://t.co/YH4ta0cVY0
— Sachin Tendulkar (@sachin_rt) August 11, 2021