ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గురువారం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి ఎలాంటి ముందస్తు ప్రోగ్రామ్ లేకుండా…హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం చర్చానీయాంశంగా మారింది. అయితే రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రిని కలిసి పోలవరంపై చర్చిస్తారని ప్రచారం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండే ప్రధాన మంత్రి ఈ సమయంలో అప్పాయింట్ ఇచ్చారా? అనే అనుమానాలు కూడా కలిగాయి. అయితే అక్రమాస్తుల కేసులో శుక్రవారం నాడు జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని..కోర్టు విచారణను తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీలో పని ఉన్నట్టుగా చెప్పి వెళ్లాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.