పవన్ కల్యాణ్ కు అశేష అభిమానులున్నారు. అతడి స్మైల్ కు సెపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ నవ్వితే చూడాలనిపిస్తుందంటారు చాలామంది. అలాంటి సందర్భం మరొకటి వచ్చింది. విశ్వక్ సేన్ సినిమా ఓపెనింగ్ కు పవన్ కల్యాణ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నవ్విన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇంతకీ పవన్ ఎందుకు నవ్వాడు? ఆ సందర్భం ఏంటి? ఇది మాత్రం చాలామందికి తెలియదు. ఇప్పుడా మేటర్ కూడా బయటకొచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వేసిన ఓ జోక్ కు పవన్ కల్యాణ్ అలా పెద్దగా నవ్వేశాడు.
ఈ సినిమాకు క్లాప్ కొట్టడానికి పవన్ వచ్చాడు. గౌరవ దర్శకత్వం వహించడానికి రాఘవేంద్రరావు.. స్విచాన్ చేయడానికి ప్రకాష్ రాజ్ వచ్చారు. పవన్ క్లాప్ బోర్డ్ పట్టుకొని ఉండగా.. మైక్ పట్టుకున్న రాఘవేంద్రరావు యాక్షన్ అనాలి. అప్పుడు పవన్ బోర్డ్ పై ఉన్నవి చదువుతూ క్లాప్ కొట్టాలి.
మొత్తానికి ఇన్నేళ్లకు పవన్ కల్యాణ్ ను డైరక్ట్ చేసే అవకాశం తనకొచ్చిందని రాఘవేంద్రరావు మైక్ లోనే అనౌన్స్ చేయడంతో పవన్ బిగ్గరగా నవ్వేశారు. దానికి సంబంధించిన ఫొటోలే వైరల్ అయ్యాయి. పవన్ తో సినిమా చేసేందుకు రాఘవేంద్రరావు గతంలో ప్రయత్నించారట. కానీ.. ఈ కాంబినేషన్ వర్కవుట్ అవ్వలేదు.