కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. అయితే నేటి కార్యక్రమం ఆలస్యంగా మొదలుకానుంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి.. ఇవాళ హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. గైర్హాజరైతే అరెస్టు వారెంట్ జారీ చేస్తామని ఆదేశించిన నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. కోర్టుకు హాజరైన తిరిగి మళ్లీ ఎక్కడ పాదయాత్రను ఆపారో.. మళ్లీ అక్కడి నుంచి కొనసాగిస్తారు.
రేవంత్ రెడ్డి పాదయాత్ర మొత్తం 8 రోజుల పాటు సాగే అవకాశముంది. ఇప్పటికే తొలిరోజు తొమ్మిది కిలోమీటర్లు, రెండో రోజు11 కిలోమీటర్లు నడిచారు.