క్రికెటర్లకు హీరోయిన్లకు మధ్య ప్రేమ వ్యవహారాలు బాగా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. చిన్న క్రికెటర్ అయినా పెద్ద క్రికెటర్ అయినా సరే హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపిన వాళ్ళు ఉన్నారు. ఇలా విరాట్ కోహ్లీ కూడా ఇద్దరు హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలను నడిపి చివరికి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. అనుష్క శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ తమన్నాని ప్రేమించాడు.
వీరు ఇద్దరూ బాగానే తిరిగారు అప్పట్లో అని ఉంటారు. కాని ఏమైందో తెలియదు గాని ఇద్దరూ విడిపోయారు. కోహ్లీ క్రికెట్ మీద ఫోకస్ చేయడానికె ఆమెను పక్కన పెట్టారని టాక్ ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అనుష్క శర్మతో ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి చేసుకున్నాడు. తమన్నా నుంచి దూరం వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీకి బాగా కలిసి వచ్చింది అనే టాక్ కూడా అప్పట్లో వినపడింది.
అనుష్క శర్మతో ప్రేమ వ్యవహారం కోహ్లీకి అన్ని విధాలుగా కలిసి వచ్చిందని, ఆమె వచ్చిన తర్వాత క్రికెట్ లో బాగా పైకి వచ్చాడని, ఆమె ఇచ్చిన పలు సలహాలతో అటు ఆర్ధికంగా కూడా బాగా ప్లాన్ చేసుకున్నాడని అంటారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. కోహ్లీ కెరీర్ ఇప్పుడు చివరి దశలో ఉంది. మూడేళ్ళ పాటు ఫాం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కోహ్లీ ఇప్పుడు మళ్ళీ ఫాంలోకి వచ్చాడు.