టీఆర్ఎస్ లో కొందరు నేతలు ఇప్పుడు కేటీఆర్ పాట పాడుతున్నారు. కేటీఆర్ సీఎం కావాలని ఒకరు, కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ఇంకొకరు, కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని మరోకరు ఇలా పోటీపడుతూ… కేటీఆర్ జపం చేస్తున్నారు. ముహుర్తం ముంచుకొస్తున్న దశలో స్వామి భక్తి ప్రదర్శించేందుకే ఈ పాట పాడుతున్నారా…? కేటీఆర్ పై నమ్మకంతో సీఎం కావాలంటున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఓవైపు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూనే… మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులతో కేటీఆర్ సీఎం కావాలన్న పాట పాడిస్తున్నారన్న అభిప్రాయం కూడా పొలిటికల్ వర్గాల్లో బలంగా ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులంతా కేటీఆర్ సీఎం కావాలని, ఆయన సీఎం అయితే పాలన మరింత మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
నేతల అభిప్రాయం చూస్తుంటే… కేసీఆర్ ఫాంహౌజ్ పాలనపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా విసిపోయారా? తమకే కలిసే అవకాశం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల్లో ఇంకా అసంతృప్తి తప్పదన్న భావనలో ఉన్నారా? భవిష్యత్ పై బెంగతో కేసీఆర్ ను ఏమీ అనలేకే కేటీఆర్ సీఎం కావాలంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్న నేతలంతా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకొని, తీర్మానం చేసి… పార్టీ అధినేత కేసీఆర్, స్పీకర్ పోచారంకు లేఖ ఇస్తే పనైపోతుంది కదా అని కామెంట్లు వినపడుతున్నాయి.