భారత పేస్ బౌలింగ్ సారథిగా ఉన్న పేసర్ జస్ ప్రీత్ బుమ్రా హఠాత్తుగా ఇంగ్లాండుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుండి దూరమయ్యాడు. నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనని… వ్యక్తిగత కారణాల వల్ల తనను రిలీవ్ చేయాలని కోరాడు. ఇందుకు బీసీసీఐ కూడా అనుమతి ఇచ్చింది.
అయితే, కీలకమైన నాలుగో టెస్టుకు ఆడకుండా ఏమిటని సీనియర్లు ప్రశ్నించారు. బీసీసీఐ కూడా ఒకే చెప్పటంపై ఫైర్ అయ్యారు. తాజాగా ఎందుకు రిలీవ్ అడిగాడనే విషయం బయటకు పొక్కింది.
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. దీంట్లో భాగంగానే అతడు చివరి టెస్టుకు దూరమైనట్టు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అసలు విషయం బయటకు చెప్పకుండా… వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనని బుమ్రా ఇదివరకే బోర్డు దగ్గర అనుమతి కూడా తీసుకున్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు బీసీసీఐకి బుమ్రా తెలిపాడు. వివాహ ఏర్పాట్ల కోసం తగిన సమయం కావాలి కాబట్టే జట్టుకు దూరమయ్యాడని బీసీసీఐ బోర్డు అధికారి ఒకరు తెలిపాడు.