వివాదాస్పదంగా మారిన మూడు సాగు చట్టాలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి ఆల్ ఇండియన్ కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ భూపీందర్ సింగ్ మాన్ తప్పుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైతుల, ప్రజల సెంటిమెంట్లను గౌరవించే ఉద్దేశ్యంతో తాను కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు నిన్న ప్రకటించిన భూపీందర్ సింగ్.. ఇవాళ మరింత స్పష్టతనిచ్చారు.
సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ముందు హాజరుకాబోమని సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు చెప్పారు. అలాంటప్పుడు కమిటీలో సభ్యుడిగా ఉండటంలో అర్థమే లేదు. అందుకే తప్పుకున్నా అంటూ భూపీందర్ సింగ్ ఎఎన్ఐతో చెప్పారు. కాగా భూపీందర్ సింగ్ సుప్రీం నియమించిన కమిటీ నుంచి తప్పుకోవడంపై రైతు సంఘాలు స్వాగతించాయి. మిగిలిన వారు అలాగే ఆలోచిస్తే.. తమకు న్యాయం దక్కుతుందని విజ్ఞప్తి చేశాయి.