బిగ్‌బాస్ సీజన్-3లో బలమైన కంటెస్టెంట్‌గా అందరూ అభిప్రాయపడ్డ అలీ రెజా హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. ‘ఇంతమంది నాకోసం ఏడుస్తున్నారే, ఇక్కడే ఇప్పుడే నేను గెలిచేశాను’ అన్నాడు.
ఏడోవారం ఎలిమినేషన్‌కు ఐదుగురు నామినేట్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, శ్రీముఖి, మహేష్ విట్టా, రవికృష్ణ నామినేషన్ లిస్టులో వున్నారు. అందులో అలీ రెజా ఎలిమినేట్ అవుతున్నట్టు నూతన్ నాయుడు ముందే చెప్పారు. అలీ నామినేట్ అవడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. వీకెండ్ బిగ్‌బాస్ హౌసులో ఎవరేం చేస్తున్నారో.. ఎవరు తప్పులు చేస్తున్నారో చెప్పి వాళ్లని కాసేపు నవ్వించి.. కాసేపు కంగారు పెట్టి.. చివర్లో టెన్షన్ పెట్టే కింగ్ నాగ్ వచ్చిరాహుల్ సేఫ్ అయినట్టు ముందుగానే ప్రకటించారు. ఇక మిగిలింది అలీ రెజా, శ్రీముఖి, మహేష్, రవి. వీళ్లు నలుగురిలో అలీ రెజా ఎలిమినేట్ అవుతాడని ముందే బయట అందరికీ తెలిసిపోవడంతో ఎవరికీ పెద్దగా షాక్ అనిపించలేదు. కానీ, హౌస్‌మేట్స్ మాత్రం బాగా ఏడ్చేశారు. అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున ప్రకటించడంతో హౌస్‌లో ముందు ఎవ్వరికీ సౌండ్ లేదు. శివజ్యోతి, హిమజ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి శివజ్యోతి, శ్రీముఖి, హిమజ ఏడుపు మొదలుపెట్టారు. రవి, రాహుల్, వరుణ్ సందేశ్ ఇలా అందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్రీముఖి, శివజ్యోతి వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పుడూ స్ట్రాంగ్‌గా కనిపించే రాహుల్ అయితే చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఇప్పటి వరకు ఐదుగురు కంటెస్టెంట్లు బయటికి వెళ్లిపోయినప్పుడు కనిపించని భావోద్వేగ సన్నివేశం అలీ బయటికి వెళ్తుంటే కనిపించింది. అందరూ కన్నీళ్లతో అలీని సాగనంపారు. తొలిసారి నామినేట్ అయిన కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు రోహిణి, అషు రెడ్డి, తమన్నా తొలిసారి నామినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు.
హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యాక అలీ వెంటనే వేదిక మీద ప్రత్యక్షమై నాగ్‌తో కలిసి అక్కడ అందరికీ వీడ్కోలు చెప్పాడు. హౌస్మేట్స్‌తో ఫోన్లో మాట్లాడే అవకాశం ఇవ్వడంతో అలీ ఒక్కొక్కరితో ఫోన్‌లో మాట్లాడి బైబై చెప్పాడు.