మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభం కొనసాగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు, అఘాడీ ప్రభుత్వ నేతలు ఒకరిని మించి ఒకరు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా వారి పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది.
తాజాగా తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేకు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ఫోన్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శివసేన నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై షిండేను రాజ్ ఠాక్రే అడిగి తెలుసుకున్నారు.
ఈ విషయాన్ని ఎంఎన్ ఎస్ నేతలు వెల్లడించారు. షిండేతో రాజ్ ఠాక్రే రెండు, మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు ఎంఎన్ ఎస్ నేతలు చెబుతున్నారు. షిండే ఆరోగ్యం గురించి ఠాక్రే అడిగి తెలుసుకున్నట్టు వివరించారు.
షిండేతో కీలక విషయాలపై ఆయన చర్చించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రెబెల్స్ వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కోర్టు ఏం చెబుతుందో అని అంతా ఆసక్తిగా చూస్తు్న్నారు.