ప్రభాస్ రూట్ మారుస్తాడా? బాహుబలితో ఆల్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ తర్వాత సాహో సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమా కూడా ప్యాన్ ఇండియా సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినపడుతున్నాయి. సినీ వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ ఓ పౌరాణిక పాత్రలో నటించబోతున్నారట. రామాయణాన్ని దర్శకుడు నితీశ్ తివారీ సినిమాగా రూపొందించనున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రంలో ప్రభాస్‌ను రావణుడి పాత్రలో నటించడానికి చిత్ర యూనిట్ సంప్రదించదని టాక్. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందబోయే చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో త్రీడీ వెర్షన్‌లో చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్యాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ నటిస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి రావణాసురుడుగా నటించడానికి అంగీకరిస్తాడా? అనేది ఆలోచించాల్సిన విషయమే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ రాముడిగా, దీపికా పదుకొనె సీతగా నటిస్తుందని సమాచారం.