అమెరికాలోని ప్రముఖ నగరం న్యూయార్క్ గురించి ‘ఎర్త్స్ ఫ్యూచర్’ సైన్స్ జర్నల్ ఆందోళనకర విషయాలు వెల్లడించింది. ఆ నగరం నెమ్మది నెమ్మదిగా భూమిలోకి కుంగి పోతోందని వెల్లడించింది. నగరంలోని భవ నిర్మాణాలు వల్ల భూమిపై అధిక భారం పడుతోందని పేర్కొంది. అధ్యయనం ప్రకారం…
నగరంలో 10,84,954 భవనాలు వున్నాయి. వీటి వల్ల భూ ఉపరితలంపై 76,200 కోట్ల కిలోల ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడి వల్ల నగరం ప్రతి ఏడాదికి సగటున 1 నుంచి 2 మిల్లీమీటర్లు కుంగి పోతోంది. పలు ప్రాంతాల్లో భవనాలు రెండు అడుగుల వరకు కూడా కుంగిపోయే అవకాశం ఉంది.
మరోవైపు సముద్ర మట్టం కూడా ఆందోళనకర స్థితిలో పెరిగిపోతోంది. గ్లోబల్ రేటు కన్నా రెండింత వేగంతో సముద్ర మట్టం పెరుగుతోంది. 2030 నాటికి సముద్ర మట్లం 30 ఇంచులు పెరిగే అవకాశం ఉంది. శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.
భారీ తుఫాన్లు సంభవిస్తే పరిస్థితి అత్యం దారుణంగా మారే అవకాశం ఉంది. నగరానికి పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లే ప్రమాదముందని అధ్యయనంలో సహ రచయిత టాప్ పార్సన్స్ చెప్పారు. మన్‌హట్టన్, బ్రూక్లీన్, క్వీన్స్ ప్రాంతాలు భూమిలో కుంగిపోతున్నాయని పరిశోధకులు తెలిపారు.