ప్రభాస్ కొత్త సినిమా రాధేశ్యామ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం యూరప్ లోనే సాగింది. ఇటీవలే రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ఇటలీ నుండి తిరిగి వచ్చింది. దీపావళి తర్వాత హైద్రాబాద్ లోనే క్లైమాక్స్ షూట్స్ చిత్రీకరించనున్నారు.
అయితే, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ క్లైమాక్స్ కోసం ఏకంగా 30కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్పెషల్ సెట్ ఏర్పాటు చేస్తుండగా… టాప్ హాలీవుడ్ యాక్షన్ ఫోటోగ్రాఫర్ నిక్ పోవెల్ క్లైమాక్స్ స్టంట్ ను పర్యవేక్షించనున్నారు.
ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజాహెగ్ధే నటిస్తుండగా… రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.