ఢిల్లీలో మరోసారి కుండపోత వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇండియా గేట్, మోతీ బాగ్, పూల్ ప్రహ్లాద్ పూర్, జోర్ బాగ్ సహా పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. రోడ్లపైన వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ లు అయ్యాయి.
రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలో రికార్డ్ స్థాయి వర్షాలు పడుతున్నాయి. వారం క్రితం కూడా కుండపోత వానతో ప్రజలు అల్లాడిపోయారు. మామూలుగా అయితే ఢిల్లీలో సెప్టెంబర్ నెలలో యావరేజ్ గా 129 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది. కానీ.. ఇప్పటికే 248 మిల్లీమీటర్ల వర్షం పడిందని వాతావారణశాఖ అధికారులు తెలిపారు. కో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించారు.