ఏడాదికి మూడు సినిమాలు… అన్నీ పక్కా హిట్ అన్న ట్రాక్ రికార్డ్… రోజు రోజుకు నాని సినిమాకు బడ్జెట్ పెంచేస్తున్న నిర్మాతలు… ఇలా అన్నీ కలిపి న్యాచురల్ స్టార్ నాని సినిమా షూటింగ్ మొదలవ్వక ముందే రికార్డు స్థాయి ధరకు అమ్ముమడయ్యింది.
టక్ జగదీష్ పూర్తి చేసిన నాని… శ్యామ్ సింగ రాయ్ లో నటించనున్నారు. టక్ జగదీష్ వేసవి రిలీజ్ కు రెడీగా ఉండగా అన్ని రకాల హక్కులు కలిసి దాదాపు 47కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలు మంచి ప్రాఫిట్స్ దక్కించుకున్నారు.
శ్యామ్ సింగ రాయ్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని అంటే సుందరానికీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను జీ5 సంస్థ ఏకంగా 52కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అన్ని రకాల రైట్స్ ఇందులో భాగమేనని డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. రీమేక్ రైట్స్ మాత్రం ఇందులో లేవని తెలుస్తోంది. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ ను దక్కించుకున్న జీ5, ఇప్పుడు నాని మూవీని ఖాతాలో వేసుకుంది.