F2తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి… కెరీర్ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం F2 కి సీక్వెల్ గా F3 తీస్తున్నాడు. ఈ మూవీలోనూ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ నటిస్తుండగా, సెకండ్ షెడ్యూల్ షూట్ నడుస్తుంది. ఇటీవలే కరోనా నుండి కోలుకున్న వరుణ్ తేజ్ కూడా షూటింగ్ హజరవుతున్నాడు.
సమ్మర్ కు రిలీజ్ కావాలని ముందుగా భావించినా…. సమ్మర్ చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ సంస్థ రికార్డు ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అన్ని భాషల డిజిటల్ హక్కులు పొందిందని, డీల్ విలువ దాదాపు 10కోట్లపైగానే ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.