ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా వాతావురణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ అక్కడ కురుస్తున్న వర్షాలతో తేమ శాతం పెరుగుతూ వస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత తేమ ప్రదేశంగా గుర్తింపు ఉన్న మేఘాలయలోని మాసిన్‌రామ్.. ఈ నెలలో మరో సరికొత్త రికార్డును సృష్టించింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 1003.6 ఎంఎంల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
ఇది 1940 నుంచి కురిసిన వర్షాపాతాల్లోనే అత్యధిక వర్షపాతం అని అధికారులు పేర్కొన్నారు. దీంత పాటుగా భూమిపై అత్యంత తేమ కలిగిన ప్రదేశంగా చెప్పబడే మరో ప్రదేశం మేఘాలయలోని చిరపుంజిలో 972 ఎంఎంల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
అందుకు కారణం అక్కడ తరచుగా వర్షాలే పడటమే అంటున్నారు అధికారులు. ఈ జూన్ నెలలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక వర్షపాతం అక్కడే జరిగిందని తెలిపారు. అది కూడా గత 24 గంటల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం.