నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ నిర్వహించి తుది ఫలితాన్ని ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ ఓ ప్రకటన చేసింది.
స్వస్తిక్ కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లను కూడా లెక్కించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో డిసెంబర్ 4న ఈసీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కాగా నిన్నటి విచారణలో 2005 రూల్ 51 ప్రకారం రిటర్నింగ్ అధికారికి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఎన్నికల సంఘం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. వివాదాస్పద ఓట్లను లెక్కింపునకు ఓకే చెప్పింది. దీంతో మిగిలిన 544 ఓట్లను రేపు లెక్కిస్తారు.