దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమౌతున్న వేళ ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేశారు పోలీసులు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 55 గన్స్, 50 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 15 నేపథ్యంలో ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ కుట్ర బయటపడింది.
మరోవైపు సరిహద్దుల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగురవేయడంపై పోలీసులు నిషేధం విధించారు. ప్రముఖ నగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పెంచారు.