హిందూ సంస్థల పోరాటం ఫలించింది. రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ఎట్టకేలకు దిగివచ్చింది. కూల్చిన చోటే భవ్యమైన ఆలయం నిర్మాణానికి అంగీకారం తెలిపింది. దీంతో ఫిలింనగర్ అభయాంజనేయ స్వామి ఆలయ వివాదానికి తెరపడింది.
ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న గుడిని రాత్రికిరాత్రి కూల్చేసింది రెడ్ ఫోర్ట్ అక్బర్ సంస్థ. విషయం తెలిసి హిందూసంఘాల ప్రతినిధులు అక్కడకు వెళ్తే.. పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు. మళ్లీ ఆలయాన్ని అక్కడే కట్టే వరకు వెనక్కి తగ్గేది లేదని పలువురు స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు దీక్షకు దిగారు. దీంతో చేసేది లేక అక్బర్ సంస్థ చర్చలకు వచ్చింది.
ఆలయం కోసం పోరాటం చేస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత పల్లపు గోవర్ధన్, వీహెప్పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, భజరంగ్ దళ్ కన్వీనర్ సుభాష్ చందర్ సంస్థతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉన్నచోటనే 2,500 గజాల స్థలాన్ని ఆలయం కోసం కేటాయిస్తున్నట్లు తెలిపింది. లిఖిత పూర్వక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు సంస్థ ప్రతినిధులు.
స్థలాన్ని అభయాంజనేయ ఆలయం ట్రస్ట్ పేరుతో రిజిష్టర్ చేసేందుకు అంగీకరించింది రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ సంస్థ. ఆలయ నిర్మాణం కోసం అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని తెలిపింది. ట్రస్ట్ లో పల్లపు గోవర్ధన్, వీహెచ్పీ అధ్యక్షుడితో పాటు భక్తులకు చోటు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. దీంతో హిందూసంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ధర్మం గెలిచిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.