అక్రమంగా 34 ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఓ వాహనాన్ని సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందరరావు ఆదేశాల ప్రకారం అలిపిరి నుంచి శ్రీవారిమెట్టు వరకు కూంబింగ్ చేపట్టిన టాస్క్ ఫోర్స్ బృందం.. అలిపిరి రోడ్డులో టీటీడీ ఎన్ క్లోజర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తుండడం గమనించారు. వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా.. దుంగలు వదిలేసి స్మగ్లర్లు పారిపోయారని ఎస్పీ తెలిపారు. వారిలో ముగ్గురిని పట్టుకొని, విచారిస్తున్నట్లు చెప్పారు. నిందితులను తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన బాల మురుగన్, వెంకటేషన్, అన్నాదురైగా గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు.