కరోనా నేపథ్యంలో రెండేండ్ల విరామం తర్వాత అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది ప్రారంభం కాబోతోంది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.
సుమారు 45 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర అగస్టు 11న ముగియనుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు కొంతమంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
‘ అమర్ నాథ్ యాత్ర కోసం ‘ యాత్రి’ రిజిస్ట్రేషన్ లు ఏప్రిల్ 11న పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోని 316 బ్రాంచ్ ల్లో ప్రారంభం అయింది. జూన్ 30వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. గతేడాది రిజిస్ట్రేషన్ పీజు రూ. 100 ఉండగా ఇప్పుడు దాన్ని రూ. 120కి పెంచాము. అందువల్ల గతేడాది రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులు అదనంగా రూ. 20లు ప్రస్తుతం చెల్లించాలి’ పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్ము డిప్యూటీ జనరల్ మేనేజ్ యతేందర్ కుమార్ తెలిపారు.
‘ 13 నుంచి 75 ఏండ్ల మధ్య భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అమర్ నాథ్ ఆలయానికి దగ్గరలోఉన్న గుర్తింపు పొందిన ఆస్పత్రుల నుంచి వారు ఆరోగ్య ధృవీకరణ సర్టిఫికెట్లను తీసుకురావాలని ఆయన వెల్లడించారు.