తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నామని సర్కార్ ప్రకటించింది. రేపటి నుండే ప్రారంభం అవుతాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించగా… కేసీఆర్ సీఎస్ తో మాట్లాడి, శుక్రవారం నుండే మొదలుపెట్టాలని ఆదేశించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా… శుక్రవారం ఉదయం ఓపెన్ కావాల్సిన సర్వర్స్ మొరాయిస్తున్నాయి. మద్యాహ్నం అవుతున్న స్లాట్ బుకింగ్స్ ఓపెన్ కావటం లేదు. పోనీ ఇదేమైనా కొత్త పద్ధతా అంటే అదీ లేదు. గతంలోనూ స్లాట్ బుకింగ్స్ తో రిజిస్ట్రేషన్స్ చేసే వారు. కానీ ఇప్పుడు పన్ను కట్టాల్సిన నెంబర్ అధికంగా అడుగుతున్నారు. కానీ సర్వర్స్ మొరాయిస్తుండటంతో సీఎస్ సోమేష్ కుమార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
రిజిస్ట్రేషన్లు ఈనెల 14 నుండి మొదలు పెట్టాలని, అప్పటి వరకు స్లాట్స్ తీసుకోవాలని నిర్ణయించారు. కానీ మొదటి రోజంతా వృధా కానుండగా… ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల నుండి రిజిస్ట్రేషన్లు ఆపి ఏం సాధించారని, ఇప్పుడు ఈ ఇబ్బందుల సంగతేంటని నిలదీస్తున్నారు.
ఇక ఎల్.ఆర్.ఎస్ ఉన్నవాటికే రిజిస్ట్రేషన్స్ చేస్తారా…? లేని వాటి పరిస్థితి ఏంటీ…? అన్న అంశాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.