బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికేసులో డ్రగ్స్ లింక్ వెలుగు చూడటంతో ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. ఈ కేసులో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత రియాకు కోర్టు బెయిల్ మంజూరు చేయగా, షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ నిరాకరించింది. దీంతో మూడు నెలలుగా షోవిక్ జైలులోనే ఉన్నారు.
తాజాగా ఎన్డీపీఎస్ కోర్టు షోవిక్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో డ్రగ్స్ అక్రమ రవాణా లేదా మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి అభియోగాలు షోవిక్ కు వర్తించవని కోర్టు పేర్కొంది. సెక్షన్ 27ఏ నార్కోటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ షోవిక్ కు వర్తించదని తెలిపింది. ఒకవేళ కేసులో ఉన్నట్టు నిర్దారణ అయితే గరిష్టంగా 20 ఏండ్లు జైలు శిక్ష పడుతుందని పేర్కొంది. రియా చక్రవర్తి డ్రగ్స్ తో వ్యాపార లావాదేవీలు ఏమీ జరగనట్టు అంచనాకు వచ్చింది.