ఒకప్పుడు ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరో అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు శోభన్ బాబు. అప్పట్లో ఫ్యామిలీ కథలే ఎక్కువగా తెరకెక్కెవి. జనాలు కూడా వాటినే ఎక్కువగా చూసేందుకు ఇష్టపడే వారు.అందుకే దర్శక నిర్మాతల కథలన్నీ కుటుంబాల చుట్టే తిరుగుతుండేవి.
అలాంటి కుటుంబ కథల్లో ప్రధానంగా సవతుల పోరు, అత్తాకోడళ్ల వైరం నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ కనిపించేది. అటు ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్ర పోషించాలంటే ఆ రోజుల్లో దర్శక నిర్మాతలకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు శోభన్ బాబు.
ఆయన కూడా అలాంటి క్యారెక్టర్లు చేయడానికి శోభన్ బాబు కూడా ఆసక్తి చూపించేవారు.అందుకే ఆయనకు లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ. వారు తమ అభిమాన నటుడు ఎలాంటి సినిమా చేసినప్పటికీ ఇష్టపడి చూసేవారు.
కార్తీక దీపంతో ప్రారంభించిన ఆయన ఎన్నో చిత్రాలలో నటించారు శోభన్ బాబు. ఆయన తరువాత తెలుగు సినిమాల్లో అంత క్రేజ్ సంపాదించుకున్న హీరో జగపతి బాబు.. ఫ్యామిలీ కథానాయకుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు.
అలా మహిళా అభిమానులకు దగ్గరైన జగపతిబాబు… ఎన్నో చిత్రాలను చేశారు. వాటిలో ఆయనకిద్దరు చిత్రం ఒకటి. ఈ సినిమాకు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకుడు.తన సినిమాలకు ఆయన పెట్టే టైటిల్స్ తమాషాగా ఉంటాయని వేరే చెప్పాలా.
ఆయనకిద్దరు చిత్రంలో జగపతిబాబు సరసన రమ్యకృష్ణ, ఊహ నటించారు.ఈ చిత్ర ప్రారంభోత్సవంలో వీరి ముగ్గురి మీద నాగార్జున క్లాప్ ఇచ్చారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి ఫామ్‌లో కొనసాగుతున్న జగపతి బాబు. పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. హీరోగా కంటే ప్రస్తుతం చేస్తున్న విలన్ పాత్రలే ఆయనకు మంచి పేరు తీసుకొస్తున్నాయి.
నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తుండటంతో ఆయనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆయన నటనలో పదును సైతం పెరిగింది.