తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్లాట్ల వేలానికి సర్వం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. బండ్లగూడలోని మొత్తం ప్లాట్లలో.. 419 ప్లాట్లకు వర్క్ పూర్తవగా.. 1082 ఫ్లాట్లకు సంబంధించిన వర్క్ అసంపూర్తిగా పూర్తి అయింది.
కంప్లీట్ గా వర్క్ పూర్తి అయిన ఫ్లాట్ల ధర చదరపు అడుగుకు రూ. 3 వేల చొప్పున.. అసంపూర్తిగా పూర్తయిన ప్లాట్ల ధరను ఒక చదరపు అడుగుకి రూ. 2,750 రూపాయలుగా నిర్ణయించారు.
పోచారంలో 1328 పూర్తిస్థాయిలో సిద్ధమవ్వగా.. 142 ఫ్లాట్లు అసంపూర్తిగా పూర్తయ్యాయి. కంప్లీట్ అయిన ప్లాట్ల ధర చదరపు అడుగు రూ. 2,500.. అసంపూర్తిగా ఉన్న ప్లాట్ల ధర చదరపు అడుగు రూ. 2,250 కు నిర్ణయించారు.
కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయించనున్నట్టు సీఎస్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ఆసక్తి గలవారు జూన్ 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మీసేవ పోర్టల్, స్వగృహ వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. జూన్ 22 న ఫ్లాట్ల కేటాయింపు చేయనున్నట్టు సీఎస్ తెలిపారు.