అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీలను ఎలా భయటపడేయాలో తలపట్టుకుంటున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ నుండి ఎలాంటి వేతనం తీసుకోకూడదని డిసైడ్ అయ్యారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి జీతం లేదా కమిషన్ తీసుకోరాదని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యూహాత్మక పరివర్తన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ల బాధ్యతతో పాటు, ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో ఆర్ కాం మేనేజ్మెంట్ కూడా ముందుకు సాగుతుందని తెలిపింది.
ఒక్క అనిల్ అంబానీ మాత్రమే కాదు సంస్థ బోర్డు సభ్యులుగా ఉన్న వారంతా 21 రోజుల వేతనం వదులుకోవాలని నిర్ణయించారు. డిసెంబర్ 2017 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది.