ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సిట్ ఊరటనిచ్చింది. ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ మొదట ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది.
కానీ ఆ తర్వాత ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ తెలిపింది. ఈ మేరకు విషయాన్ని రఘురామ కృష్ణమరాజుకు విచారణాధికారి ఏసీపీ గంగాధర్ మెయిల్ ద్వారా సందేశం పంపారు.
మళ్లీ అవసరం ఉన్నప్పుడు విచారణకు పిలుస్తామని అప్పుడు హాజరు కావాలని ఆయనకు ఏసీపీ సూచించారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సిట్ మూడు రోజుల క్రితం నోటీసులు పంపింది.
మంగళవారం ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించింది. సిట్ ముందుకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.