సింహాచలం కొండ పైకి భక్తులను తీసుకెళ్తున్న బస్సు పై అన్యమత ప్రచారానికి సంబందించిన స్టిక్కర్లు ఉండటంతో బస్సు లను నిలిపివేశారు. హిందువుల పవిత్ర దేవాలయం అయిన సింహాచలం కొండ మీదకు ఇలా వేరొక మతానికి సంబందించిన స్టిక్కర్లు ఉన్న బస్సులను ఎలా తీసుకొస్తారంటూ దేవస్థానం ట్రాన్స్ పోర్ట్ సూపరింటెండెంట్ ముద్దాడ వెంకట రమణ డ్రైవర్, కండెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంకటరమణ ఆలయ ఈవో వెంకటేశ్వరరావు వద్దకు తీసుకెళ్లారు . బస్సులో ఉన్న ప్రయాణికులను అక్కడే దించి బస్సులను ఖాళీగా దిగువకు పంపించారు. సింహగిరిపై కి వచ్చే బస్సులపై హిందూ మత ప్రచారం తప్ప అన్యమత ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అటువంటి బస్సు తీసుకురావద్దని ఆర్టీసీ ఉద్యోగులకు వెంకటరమణ తెలియజేశారు.
ఈ సంఘటనపై సింహాచలం డిపో మేనేజర్ కి వివరణ కోరారు ఆలయం ఏవో వెంకటేశ్వర్ రావు. అన్యమత ప్రచారం చేస్తున్న బోర్డులు ఉన్న బస్సులను కొండమీదకు పంపకుండా తగిన చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ చెప్పటం వివాదం సర్దుమనిగింది.