నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ లోకి వచ్చారు. అయితే అందులో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్ప మిగిలిన వారు ఎవరూ కూడా కొనసాగే లేకపోయారు. కళ్యాణ్ రామ్ కూడా అంతంత మాత్రంగా రాణిస్తున్నాడు. బాలకృష్ణ, ఎన్టీఆర్ మాత్రం స్టార్ డమ్ ను తెచ్చుకున్నారు. నిజానికి 1980లోనే నందమూరి ఫ్యామిలీ నుండి ఓ స్టార్ హీరో పరిచయమయ్యాడు. ఇది ఇప్ప జనరేషన్ వారికి చాలా మందికి తెలీదు. అతి తక్కువ టైమ్ లోనే తనకంటూ మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ఆ హీరో సడన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేసాడు. అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి తో మల్టీస్టారర్ మూవీ చేశాడు.
ఆ హీరో మరెవరో కాదు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. తలంబ్రాలు, ఇంటిదొంగ, రౌడీ బాబాయ్, దొంగ కాపురం వంటి సినిమాల్లో నటించిన కళ్యాణ్ చక్రవర్తి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ చక్రవర్తి ని చూసిన ఎంతోమంది సీనియర్స్ మంచి స్టేజ్ కి వెళ్తాడని అనుకున్నారు. కానీ సడన్ గా సినిమాలకు దూరం అయ్యాడు.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. పొంచిఉన్న అసని తుఫాన్..!
ఇక కళ్యాణ్ చక్రవర్తి సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు కొడుకు. కళ్యాణ్ చక్రవర్తి కి తన తండ్రి త్రివిక్రమరావు తో మంచి అనుబంధం ఉండేది. ఆయన చెప్పినట్టే వినేవాడు. కళ్యాణ్ చక్రవర్తి సినిమాల ఎంపిక విషయంలో తండ్రి త్రివిక్రమరావుదే ఫైనల్. తండ్రి కథ విన్నాకే తాను వినేవాడు. తండ్రి సరే అంటే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు.
మార్నింగ్ మేకప్ వేసుకుని వెళ్లడం టైం కాగానే తిరిగి ఇంటికి రావడం ఇలా ఎంతో పద్ధతిగా నడుచుకునే వాడట కళ్యాణ్. సినిమా కోసం కాల్ సీటిస్తే దానికి తిరుగుండేది కాదట. నిర్మాత చిన్నవాడా, పెద్దవాడా అనేది కూడా పట్టించుకునేవాడు కాదట. మొదట కళ్యాణ్ చక్రవర్తి కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత రౌడీ బాబాయ్ వంటి యాక్షన్ సినిమాలో నటించారు.
అలాగే భక్త కబీర్ దాసులో శ్రీరాముడిగా కూడా నటించాడు కళ్యాణ్. ఆ సినిమా చేస్తున్న సమయంలో కళ్యాణ్ పెదనాన్న ఎన్టీఆర్ లాగే నియమనిష్టలను పాటిస్తూ… భక్తితో ఆ గెటప్ వేసుకునేవాడట. నేను వ్యక్తిగా మా నాన్న అంత… నటుడిగా మా పెదనాన్న అంత అయినప్పుడే నేను అనుకున్నది సాధించినట్లు అంటూ చెప్పేవాడు కళ్యాణ్ చక్రవర్తి.
అయితే అగ్ని నక్షత్రం సినిమా తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు. అందుకు కారణం రోడ్డు ప్రమాదం. ఓ రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు హరిన్ చక్రవర్తి కొడుకు పృద్వి ప్రాణాలు కోల్పోయారు. అలాగే తండ్రి త్రివిక్రమరావు గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్ కళ్యాణ్ చక్రవర్తికి పెద్ద షాక్ గా మారింది.
ఈ షాక్ నుంచి తేరుకోలేక పోయాడు. గాయపడిన తండ్రికి సేవ చేస్తూ సినిమాలకు దూరం అయ్యాడు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పటికీ బిజినెస్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు.
Advertisements
Also read: ఆయనే సీఎం.. నేడు ప్రమాణ స్వీకారం