గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే బీఆర్ఎస్ కు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతూ.. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన బీఆర్ఎస్ కు మరో షాక్ ఇచ్చారు.
తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లలో కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ఫొటోలను, ఫ్లెక్సీలను తొలగిస్తూ షాక్ ఇచ్చారు. అలాగే ఖమ్మం క్యాంపు కార్యాలయం పరిధిలోని ఫ్లెక్సీలు, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను కూడా తొలగించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా కొత్త సంవత్సరం రోజు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మొదటి సారి గొంతెత్తిన పొంగులేటి.. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వ హామీలపై మాటల తీవ్రతను పెంచారు.
ఆత్మీయ సమావేశాలతో ప్రజల్లోకి వెళ్తున్న ఆయన.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పినపాక, ఇల్లందు, మధిర నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.
దూకుడు పెంచుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్, కేటిఆర్ ఫోటోలు, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బోర్డులు తొలగింపు.#Ponguleti #Khammam pic.twitter.com/c6C30cL1Np
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2023