బుల్లితెర మీదే కాదు.. అనసూయ వెండి తెర మీద కూడా నటిగా తనను తాను ఇప్పటికే రుజువు చేసుకుంది. తనకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటోంది. తనకు లభించే పాత్రలకు న్యాయం చేస్తోంది. మరోవైపు బుల్లితెర యాంకర్‌గా కూడా రాణిస్తోంది. ఈ క్రమంలో అటు బిగ్ స్క్రీన్, ఇటు స్మాల్ స్క్రీన్‌లను ఆమె బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది.
ఇక తాజాగా ఆమె చావు కబురు చల్లగా అనే మూవీలో ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆ పాటకు అనసూయ డ్యాన్స్ చేయడంతో గ్లామర్ వచ్చింది. అయితే ఆ పాటకు ఆమె నిర్మాత బన్నీ వాస్ నుంచి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిసింది. కానీ ఆమెకు ఆయన రూ.15 లక్షలు ఇస్తారని తెలిసింది.
ఇక ఈ మూవీలో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే కార్తికేయ కూడా ఈ మూవీ చేసినందుకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కనుక అటు అనసూయ, ఇటు కార్తికేయ ఇద్దరికీ సినిమా విడుదలయ్యాక తగిన రెమ్యునరేషన్ ఇస్తారని టాక్ నడుస్తోంది.