‘పొన్నియిన్ సెల్వన్ 1’.. ఇప్పుడు దక్షిణాదిన ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఈ సినిమాను మణిరత్నం తెరకెక్కించారు. ఈ నెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
పదో శతాబ్దం లోని చోళరాజుల బ్యాక్ డ్రాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాచారు. అందులో మొదటి భాగమే‘పొన్నియిన్ సెల్వన్ 1’.ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రగా తెలుస్తోంది. ఆమె పాండ్య రాజుతో ప్రేమలో పడగా, ఆమె కండ్ల ఎదుటే పాండ్య రాజును చోళ రాజు ఆదిత్య కరికలాన్ చంపుతాడట.
దీంతో తన ప్రేమికున్ని చంపిన వారిపై నందిని ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందనే అంశాన్ని మణిరత్నం అద్భుతంగా తెరకెక్కించాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను మణిరత్నం తెరకెకించారు. ఇందులో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏ నటులు ఎంత తీసుకున్నారో చూద్దాం..
1 ప్రకాశ్‌రాజ్
చోళ సామ్రాజ్యానికి సుందర చోళుడు రాజు. ఆయన అనారోగ్యంతో మంచానపడతాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సినిమాలో ఈ పాత్రను ప్రకాశ్‌రాజ్ పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ. కోటి వరకు ప్రకాశ్‌రాజ్ తీసుకున్నారట.
2 విక్రమ్
సుందర చోళుడి పెద్ద కుమారుడు, చోళ సామ్రాజ్యపు యువరాజు ఆదిత్య కరికాలుడు. ఈ సినిమాలో ఆ పాత్రలో విక్రమ్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ. 12 కోట్ల వరకు విక్రమ్ తీసుకున్నట్టు టాక్ వస్తోంది.
3 త్రిష
ఈ సినిమాలో రాజకుమారి కుందవై పాత్రను త్రిష పోషిస్తున్నారు. ఈ సినిమాకు గాను ఆమో రూ. 2.5 కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం.
4 జయం రవి
సుందర చోళుడి చిన్న కుమారుడు అరుళ్‌మోళి వర్మన్. ఆయన్నే అందరూ ‘పొన్నియిన్ సెల్వన్’అని కూడా పిలుస్తారు. ఆ పాత్రలో జయం రవి కనిపించనున్నాడు. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ గా రూ. 8 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది.
5 కార్తి
ఆదిత్య కరికాలన్‌కు వల్లవరాయన్ వందిదేవన్ అనే వ్యక్తి అత్యంత నమ్మకస్తుడైన ప్రాణ స్నేహితుడు. ఈ పాత్రలో కార్తి నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం కార్తి రూ. 5 కోట్లు అందుకున్నారట.
6 ఐశ్వర్య రాయ్
ఈ సినిమాలో ప్రతినాయిక ఛాయలున్న పాత్ర నందిని. ఈ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమెకు రూ. 10 కోట్లు వరకు ఇచ్చారట.
7 ఐశ్వర్యా లక్ష్మీ
పూంగుళలి పాత్రలో ఐశ్వర్యా లక్ష్మీ నటించింది. పడవ నడిపే యువతిగా ఆమె కనిపించారు. ఈ పాత్ర కోసం ఆమెకు రూ. 1.5 కోట్లు ఇచ్చారట.