రిచ్ కిడ్స్ రిచ్ గానే ఆలోచిస్తారు… మంచి హోదా ఉన్న వాళ్ళు హోదా గానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక స్టోరీ చదివితే మరీ ఈ రేంజ్ లో ఖర్చు పెడతారా రిచ్ గా ఉండటానికి అనుకుంటారు… ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అద్దెకు తీసుకున్న ఇంటికి కడుతున్న అద్దె తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. లండన్ లోని మేఫేర్‌లో ఈ ఇల్లు ఉంది.
వారానికి 50,000 పౌండ్ల అద్దె చెల్లిస్తున్నారు. అంటే 69 వేల డాలర్ల అద్దె కడుతున్నారు ఆయన. ఇది లండన్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉంది. ఇది లండన్ లో ఒక రికార్డు అని చెప్తున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనవల్లా, పోలిష్ బిలియనీర్ డొమినికా కుల్జిక్ కు చెందిన ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఒక ప్రముఖ హైవే పక్కన ఇది ఉంది.
ఈ ఇల్లు అతిపెద్ద నివాసంగా అక్కడి వారు చెప్తున్నారు. సుమారు 25 వేల చదరపు అడుగులు (2,322 చదరపు మీటర్లు) ఉంటుంది. అక్కడి 24 ఇళ్ళకు సమానం ఈ ఇల్లు. అయితే దీనికి సంబంధించి వివరాలు బయటపెట్టడానికి పూనావల్లా అంగీకరించలేదు. అయితే మేఫేర్‌లో గత ఐదేళ్లలో అద్దెలు 9.2% తగ్గాయని ప్రాపర్టీ డేటా సంస్థ లోన్‌రెస్ తెలిపింది. లండన్ మరియు ఇంగ్లీష్ గ్రామీణ ప్రాంతాల్లో అద్దెకు తీసుకునే సంపన్నులు పెరిగారని కూడా ఆ సంస్థ చెప్పింది.
ప్రస్తుతం ఆస్ట్రాజెనీకా పిఎల్‌సి… కోవిడ్ -19 వ్యాక్సిన్ ను సీరం తయారు చేస్తుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకున్నారు. మేఫేర్‌లోని గ్రోస్వెనర్ హోటల్‌ను కొనుగోలు చేసి, అందులో కొంత భాగాన్ని ఇంటిగా మార్చే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. అయితే బ్లూమ్‌బెర్గ్ న్యూస్‌తో 2016 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తనకు రెండో ఇల్లు కొనుక్కుంటే ఇక్కడ కొనుక్కోవాలి అని కోరికగా ఉందని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం పూనవల్లా ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు. ఆయనకు 15 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి.