మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరావు బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించబోతుందట. ఇప్పటికే ఆమెతో మేకర్స్ సంప్రదింపులు చేస్తున్నారట. రవితేజ సోదరి పాత్రకోసం మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం.
నిజానికి జానీ సినిమా తరువాత రేణు దేశాయ్ బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇటీవల బుల్లితెర పై జడ్జిగా కనిపించినరేణు ఇప్పుడు వెండితెరపై కూడా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇక ఇటువంటి సమయంలో రవితేజ పాన్ ఇండియా చిత్రంలో ఛాన్స్ రావడం అంటే రేణు దేశాయ్ రీఎంట్రీ కి ఇదే సరైన సమయం అని చెప్పాలి. మరి చూడాలి రేణు ఏం చేస్తుందో.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతోపాటు ధమాకా, ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, సినిమాలు చేస్తున్నాడు రవితేజ. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమా కూడా చేస్తున్నాడు.