జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అడపా దడపా మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె గురించిన వార్తలు తెరపైకి వస్తూనే ఉంటాయి. అయితే ఆమె సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గానే ఉంటున్నారు. తన అభిమానులతో ఆమె టచ్‌లో ఉంటూ వస్తున్నారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నారు.
కాగా రేణు దేశాయ్ ప్రస్తుతం తన కుమారుడు అకీరాను నటుడిగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. అయితే తన కొత్త లవ్ గురించి ఆమె తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. గతంలో ఆమె తన రెండో వివాహంపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఆమెను తీవ్రంగా విమర్శించారు. రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవద్దని అన్నారు. స్టార్ నటుడి మాజీ భార్యగానే ఉండాలన్నారు.
అయితే అప్పట్లో ఆమె ఈ విషయంపై స్పందించినా తరువాత దీని గురించి అందరూ మరిచిపోయారు. ఇక తాజాగా ఆమె మళ్లీ లవ్‌లో పడ్డారు. అయితే అది మనిషితో కాదు లెండి. ఆమె కుక్కతో. అవును. ఆమె తన కుక్కకు ప్లూటో అని పేరు పెట్టారు. ఆ పేరును సోషల్ మీడియాలో ప్రకటించారు.
అక్కినేని అమలలాగే రేణు దేశాయ్‌కి కూడా జంతువులు అంటే ఇష్టం. అందులో భాగంగానే ఆమె పలు పెంపుడు జంతువులను ఇంట్లో పెంచుతున్నారు. అయితే ప్లూటో గురించి చెప్పిన ఆమె అదంటే తనకు ఎంతో ఇష్టమని, దాంతో లవ్‌లో పడ్డానని తెలిపారు.