పవన్ కళ్యాణ్ తో విడిపోయాక రేణూ దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా రేణు దేశాయ్ పెట్టిన ఒక పోస్టు ఆసక్తికరంగా మారింది. తన కూతురుతో కలిసి పపన్ కళ్యాణ్ దిగిన ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ పిల్లలకు అద్భుతంగా, అందంగా తమ తల్లిదండ్రుల పోలికలు వస్తాయి. ఒక్కోసారి ఆద్య నాలా కనపడుతుంది. చాలా సార్లు ఆమె తన నానమ్మ, నాన్నలా కనపడుతుంది. ఆమె నా కెమెరా ఫేవరెట్ పర్సన్ అని రేణూ దేశాయ్ రాశారు. దీంతో ఎందుకు రేణూ ఈ ఫోటో షేర్ చేశారు అని కొంతమంది ఆరా తీస్తుంటే…. పవన్ ఫాన్స్ మాత్రం తెగ రిప్లై ఇస్తున్నారు. ఎంతైనా ఆ పిల్లలది పవన్ రక్తం కదా అని కొందరు, మా ఆరాధ్యదైవం కూతురు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారికి రేణూ కౌంటర్ ఇస్తూ.. సైన్స్ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని రిప్లై ఇచ్చింది. అయితే ఈరోజు సడన్ గా… రేణూ ఆద్య ఫోటో షేర్ చేసి తన నాన్నలా ఉందనడం విశేషం.