పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. అయితే వివాహబంధం విఫలం కావడం పట్ల రేణుదేశాయ్ ఓ వీడియోను విడుదల చేశారు. అయితే తమ వివాహం కూడా విఫలం కావడంపై గతంలో చాలాసార్లు స్పందించిన రేణుదేశాయ్ ఈసారి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి రోజు ఇదే విషయంపై స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాబోయే జీవిత భాగస్వామితో రిలేషన్ షిప్ ను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరికి ఉంటుందని ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.
చాలామంది తమ భర్త మంచిగా లేరని తెలిసి కూడా అతనితో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తారని అది భారతీయ మహిళలకు అలవాటైపోయిందని రేణు దేశాయ్ తెలిపారు. వివాహం విఫలం అయింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుందని దాని కర్మ అని కూడా అనుకోవచ్చు అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రేణు దేశాయ్ మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ముందడుగు వేయాలని చెప్పుకొచ్చారు.