పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరు కు యూత్ లో ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. అయితే పవన్ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టానికి సిద్ధంగా ఉన్నాడు అకీరా . పవన్ రేణు ల దాంపత్య జీవితానికి ప్రతిఫలంగా అకీరా ప్రస్తుతం రేణు దేశాయ్ దగ్గర ఉంటున్నాడు. అయితే మదర్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో రేణుదేశాయ్ మాట్లాడుతూ అకీరా ఇష్టాఅయిష్టాలను చెప్పుకొచ్చింది. ఇద్దరు పిల్లల కెరీర్‌ని ఆమె ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారో తెలిపిన రేణు అకీరాకు ఏ హీరో అంటే ఇష్టమో కూడా తెలిపింది.
అకీరా కు యంగ్ హీరో అడివి శేష్ గారంటే చాలా ఇష్టం. ‘ఎవరు’ సినిమా చూసినప్పటి నుంచి అడివి శేష్‌గారిని అకీరా బాగా ఇష్టపడుతున్నాడు. తను నా ఫేవరేట్ హీరో అని కూడా చెబుతుంటాడు. అడివి శేష్‌గారిని అకీరా, అన్నా.. అని పిలుస్తాడని దేశాయ్ తెలిపారు.