పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఓ వెబ్ సైట్ పై రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెబ్ సైట్ లో రాసిన కథనం చదివిన రేణుదేశాయ్ అదంతా అవాస్తవమని ఖండించింది అసత్య ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.
తనకి కరోనా పాజిటివ్ లేదని తెలిసిన వారికి రావడంతో నేను కూడా టెస్ట్ చేయించుకున్నానని…కానీ నాకు నెగిటివ్ వచ్చిందని చెబుతూ కరోనా టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దయచేసి ఇటువంటి వార్తలు రాయవద్దంటూ హెచ్చరించింది. సెలబ్రిటీల విషయంలో అత్యుత్సాహం తగ్గించు కోవాలని చెప్పుకొచ్చింది.