టాలీవుడ్ లో రేణూ దేశాయ్ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఆమె అంత ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించకపోయినప్పటికీ…అప్పుడప్పుడు ఆమె కొన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఆమె ఏ పోస్ట్ పెట్టిన అది కచ్చితంగా వైరల్ అవుతుంది.
రేణూ ఎక్కువగా పర్యావరణం గురించి, ప్రకృతి గురించి సహజ పోస్టులే చేస్తుంటుంది. లేకపోతే పిల్లల గురించి పోస్ట్ లు పెడుతూంటుంది. ఆద్య అల్లరి, అకీరా టాలెంట్ వీడియోలు , ఫొటోలు పంచుకుంటు ఉంటారు. అయితే తాజాగా రేణూ ఓ పోస్ట్ చేశారు. అందులో ఓ సర్వే గురించి తెలిపారు. అది ఏంటంటే సన్ స్క్రీన్ వాడే వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారట. ఈ సర్వే అమెరికాలో జరిగిందని, అక్కడ ఇలాంటి బాధితులు ఎక్కువని ఆమె వెల్లడించారు.
దీనిపై రేణూ మాట్లాడుతూ ఇంత వరకు నా జీవితంలో వాటిని ఒక్కసారి కూడా వాడలేదు.ఆద్య, అకీరాలను కూడా వాటిని వాడనివ్వను. ఫ్యాషన్ ట్రెండ్లను గుడ్డిగా ఫాలో అవ్వడం ఆపండి అంటూ రేణూ అందరినీ హెచ్చరించింది. మొత్తానికి సన్ స్క్రీన్లు, లోషన్లు అంటూ ఇప్పటి యువత ఎంతలా వాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. రేణూ మాత్రం వాటి అన్నింటికీ దూరంగానే ఉంటుందట.
రేణూ మళ్లీ నటిగా తన కెరీర్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణూ దేశాయ్ మళ్లీ తెలుగు తెర మీద ఎంట్రీ ఇవ్వబోతున్నారు.